ఈ చిట్కాలతో నోటి  ఆరోగ్యం మీ సొంతం.. 

రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం వల్ల దంతాలతో పాటూ చిగుళ్లు  కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

ఫ్లోరైడ్ ఉండే టూత్ పేస్ట్ వాడడం  వల్ల నోరు ఆరోగ్యంగా ఉంటుంది. 

బ్రష్ చేసుకున్న తర్వాత ఫ్లాస్  చేయడం వల్ల దంతాల మధ్య చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. 

బ్రష్ చేసుకున్న తర్వాత  నోరును శుభ్రంగా కడుక్కోవాలి. 

రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. దీంతో నోటిలో చెడు బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. 

రోజూ ఉప్పు నీటితో పుక్కిలిండం  వల్ల నోరు ఆరోగ్యంగా ఉంటుంది. 

ధూమపానం అలవాటు ఉన్న వారు వెంటనే మానేస్తే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 

ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో  పాటూ ఏడాదికోసారి దంత  వైద్యుడిని సంప్రందించాలి.