బ్లడ్‌లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్లు తినాల్సిన ఫుడ్స్ ఏంటంటే..

విటమిన్ సీ అధికంగా ఉన్న నిమ్మజాతి పళ్లతో హిమోగ్లోబిన్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి

ఐరన్ అధికంగా ఉండే ఆకుకూరలు, లివర్, పప్పు దినుసులు, తృణధాన్యాలు కూడా సరిపడినంతగా తినాలి

ప్రొటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే దాన్నిమ్మలో కూడా ఐరన్ కాల్షియం అధికంగా ఉంటాయి.

ఖర్జూరాల్లో కూడా ఐరన్ అధికంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ పెంచేందుకు ఇది దోహదపడుతుంది.

బీట్‌రూట్ రోజూ తింటే హిమోగ్లోబిన్ స్థాయిలో పెరుగుతాయి. బీట్ రూట్‌లో ఐరన్, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ అధికం

పల్లీలు, భఠాణీలు వంటివి కూడా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగేందుకు కీలకం

ఐరన్, విటమిన్ సీ అధికంగా ఉండే పుచ్చకాయతో కూడా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుకోవచ్చు