రక్తంలో ఉండే అనేక కణాల్లో ప్లేట్‌లెట్స్ కూడా ఒకటి

ఇవి గాయాల వద్ద రక్తం గడ్డ కట్టేలా చేసి రక్తస్రావాన్ని అరికడతాయి

కొన్ని రకాల ఫుడ్స్‌ తింటే రక్తంలో ప్లే్ట్‌లెట్ కౌంట్ బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు

ప్లేట్‌లెట్స్ ఉత్పత్తికి విటమిన్ ఏ అవసరం. ఇది గుమ్మడిగాయల్లో దండిగా ఉంటుంది

యాంటీఆక్సిడెంట్స్, విటమిన్లు పుష్కలంగా ఉండే దానిమ్మతో కూడా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది

బీట్‌రూట్‌లో ఉండే ఫోలేట్, విటమిన్ సీ ప్లేట్‌లెట్ల పనితీరును మెరుగుపరుస్తాయి

ఉసిరి కూడా ప్లేట్‌లెట్‌‌ల కౌంట్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది

రక్తం గడ్డ కట్టేందుకు అవసరమైన విటమిన్ కే బ్రోకలీలో సమృద్ధిగా ఉంటుంది.