ఒత్తైన, పొడవైన నల్లని జుట్టు కావాలని కోరుకునే వారు కొన్ని ఫుడ్స్ అస్సలు తినొద్దు. అవేంటంటే..

ఎక్కువ ఉప్పు వినియోగిస్తే నెత్తిపై చర్మంలో నీరు నిలిచి సమస్యలు  వస్తాయి. జుట్టు రాలిపోతుంది

రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి జుట్టుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

అనారోగ్యకర కొవ్వులు ఉండే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌తో కూడా చర్మం ఆరోగ్యం చెడిపోయి జుట్టు రాలుతుంది

అతిగా కాఫీలు తాగితే చర్మంలో తేమ తగ్గి జుట్టు పెళుసుగా మారి ఊడిపోతుంది.

జుట్టు ఎదుగుదలకు కావాల్సిన విటమిన్లు, మినరల్స్ మద్యపాపం కారణంగా కోల్పోవాల్సి వస్తుంది.

ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ పదార్థాలు ఉన్న ఫుడ్స్‌తో పోషకాలు అందక జుట్టుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

అయితే, ఏ ఫుడ్ అయినా ఓ మోస్తరుగా తింటే రుచిని ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు