కొన్ని పండ్లు జీర్ణక్రియను వేగవంతం చేసి బరువును అదుపులో ఉంచుతాయి

ఫలితంగా కొవ్వులు వేగంగా కరిగి ఆరోగ్యం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయి పండులోని పాపెయిన్ జీర్ణక్రియల వేగం పెంచి కొవ్వులు త్వరగా కరిగిపోయేలా చేస్తుంది

బెర్రీల్లోని ఆంథోసయానిన్ కూడా కొవ్వుల ఆక్సిడేషన్, ఇన్సులీన్ సెన్సిటివిటీని పెంచుతుంది.

యాపిల్‌లోని పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణక్రియ మరింత సమర్థవంతంగా జరిగేలా చేస్తుంది.

నిమ్మరసం కూడా కొవ్వులు త్వరగా కరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది

నారింజలు కూడా జీవక్రియల వేగం పెంచి కొవ్వు త్వరగా కరిగిపోయేలా చేస్తాయి.