ఒంట్లో వేడిని తగ్గించే 8 పండ్లు ఇవి. తప్పక ట్రై చేయండి

పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఎలక్ట్రోలైట్ సమతౌల్యాన్ని పునరుద్ధరిస్తుంది. 

కీరదోసలో నీరు, విటమిన్లు అనేకం ఉంటాయి. ఇది కూడా శరీరాన్ని కూల్ చేసి విషతుల్యాలను తొలగిస్తుంది

పైనాపిల్ పండులోని బ్రొమోలిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరిచి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. 

బొప్పాయి పండుకు ఉండే చల్లబరిచే గుణం గొప్పది. ఇందులో బోలెడన్ని విటమిన్లు కూడా ఉంటాయి

బెర్రీల్లో నీరు, యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా శరీరంలోని వేడిని బాగా తగ్గిస్తుంది.

మామిడి పండుతో పాటు మామాడికాయలో కూడా శరీరంలో వేడి తగ్గించే గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి తేమ శాతం పెంచే దాన్నిమ్మ కూడా ఒంట్లో వేడిని సమర్థవంతంగా తగ్గిస్తుంది

నిమ్మలో కూడా ఒంట్లో వేడిని తగ్గించే గుణం ఉంది. ఇందులో నీరు, విటమిన్లు పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం.