సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, ట్రౌట్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్రెర్రీస్, బ్లాక్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో నిండి ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ వాపును తగ్గిస్తాయి.
బచ్చలికూర, కాలే వంటి కూరగాయలలో విటమిన్ ఇ, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయి.
వాల్ నట్లు, బాదం, అవిసె గింజలు, చియా గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్ మంచి మూలాలు, వాపు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహకరిస్తుంది.
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ నొప్పిని నివారిస్తుంది.
అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇవి కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఇబ్బందిని తగ్గిస్తుంది.
ఆలివ్ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది.
వెల్లుల్లిలో డయల్ డైసల్ఫైడ్ ఉంటుంది. ఇది ఆర్థరైటిస్‌లో కార్టిలైజ్ దెబ్బతినడానికి కారణమయ్యే ఎంజైమ్‌లను తగ్గిస్తుంది. గ్రీన్ టీలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.