వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే  కానీ ఎక్కువగా వాడితే  జరిగేది ఇదే..

వెలుల్లి అనేక ఆరోగ్య  సమస్యలను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

వెల్లుల్లిని ఎక్కువగా తింటే  జీర్ణ సంబంధ  సమస్యలు కలుగుతాయి. 

వెల్లుల్లిలో ప్రక్టాన్ అనే  సమ్మేళనం ఉంటుంది.

దీన్ని పెద్ద పరిమాణంలో  తీసుకుంటే జీర్ణక్రియకు,  ప్రేగులకు ఇబ్బంది కలుగుతుంది. 

కొందరికి వెల్లుల్లి తింటే అలెర్జీ  వస్తుంది. శరీరం మీద దద్దుర్లు,  అనాఫిలాక్సిస్ వంటివి ఈ  అలెర్జీలో భాగంగా ఉంటాయి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది  కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.

వెల్లుల్లి అధికంగా తింటే  ఎదురయ్యే ప్రమాదకరమైన  సమస్యలలో రక్తస్రావం కూడా ఒకటి.

సున్నితమైన చర్మం ఉన్నవారికి  వెల్లుల్లి చేటు చేస్తుంది. వెల్లుల్లిని  నేరుగా చర్మం పై ఉపయోగించకూడదు.