వెల్లుల్లి వంటింట్లో ఉండే గొప్ప ఔషదం. ఆయుర్వేదం నుండి అన్ని రకాల వైద్య విధానాలు వెల్లుల్లి ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతాయి.

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. చలికాలంలో వ్యాధుల సమస్య తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.

వెల్లుల్లి జలుబు, దగ్గు లక్షణాలను తగ్గిస్తుంది. ఈ సమస్యల నుండి తొందరగా ఉపశమనం కలిగిస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలలో వెల్లుల్లి ఎప్పుడూ ముందుటుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో దీన్ని వాడటం వల్ల గుండెకు మేలు చేస్తుంది.

జలుబు, కఫం, శ్వాసనాళాలు కుచించుకుపోవడం వంటి సమస్యలను తగ్గించి శ్వాసక్రియ సాఫీగా జరగడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.

చలికాలంలో కీళ్ల నొప్పులు,  వాపులు చాలా ఎక్కువ అవుతాయి. వాటిని తగ్గించడంలో వెల్లుల్లి సమర్థవంతంగా పనిచేస్తుంది.

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చలికాలంలో చర్మం పొడిబారకుండా కాపాడతాయి.

సాధారణ రోజులతో పోలిస్తే చలికాలంలో జీవక్రియ మందగిస్తుంది.  వెల్లుల్లి జీవక్రియను వేగంగా జరిగేలా చేస్తుంది.