నెయ్యి స్వచ్ఛమైనదో కాదో ఎలా తెలుసుకోవాలంటే..

గ్లాసునీటిలో చెంచా నెయ్యి వేయండి. నీళ్లలో నెయ్యి తేలితే అది స్వచ్ఛమైనదని అర్థం

పాన్‌లో 3 చెంచాల నెయ్యి వేసి కొంచెం సేపు వేడి చేయాలి. 24 గంటల తర్వాత అది చిన్న చిన్న రేణువుల్లా మారి సువాసన వస్తే స్వచ్ఛమైందని లెక్క. 

2 చెంచాల నెయ్యిలో అర చెంచా ఉప్పు వేసి 20 నిమిషాలు పక్కన పెట్టాలి. అనంతరం నెయ్యి రంగు మారితే అది కల్తీ అని అర్థం.

అరచేతిలో కాస్త నెయ్యి వేసుకోండి. కాసేపటికి అది కరిగితే నాణ్యమైన నెయ్యి అని అర్థం.

చెంచా నెయ్యిని పాన్‌లో వేసి వేడి చేయాలి. వెంటనే కరిగి ముదురు చాక్లెట్‌ రంగులోకి మారితే అది స్వచ్ఛమైనదని లెక్క.