టెస్టోస్టెరాన్ పెంచే పది ఆహారాల గురించి తెలుసా..!

విటమిన్ డి, కొలెస్ట్రాల్, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న గుడ్లు టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహకరిస్తుంది.

సాల్మన్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి.

చికెన్ లో ప్రోటీన్, జింక్ అధిక స్థాయిలో ఉంటాయి. ఈ రెండూ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి అవసరం. 

బచ్చలికూరలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే విటమిన్ B6, K కూడా ఉన్నాయి.

బాదం, వాల్ నట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, మెగ్నీషియం మంచి మూలాలు. ఇవన్నీ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహకరిస్తాయి.

ద్రాక్షలో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. స్మెర్మ్ నాణ్యతను నెరుుగపరుస్తుంది.

కొబ్బరి, కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి ముఖ్యమైనవి. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ కూడా ఉంది.