మెదడును యవ్వనంగా ఉంచే అలవాట్లు ఇవే..

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక శ్రమ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. 

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,లీన్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయి. 

పజిల్స్ పూర్తిచేయడం, చదవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, మెదడుకు పదును పెట్టే ఆటలు ఆడటం వంటివి మెదడును ఉత్తేజపరుస్తాయి. 

మెదడు ఆరోగ్యానికి తగినంత ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం.

మైండ్ ఫుల్ నెస్, ధ్యానం, శ్వాస మీద ధ్యాస ఉంచడం వంటివి ఒత్తిడిని దూరం చేస్తాయి. 

డిహైడ్రేషన్ మెదడు సామర్థ్యాన్ని, ఏకాగ్రతను తగ్గిస్తుంది.