వర్షాకాలంలో జుట్టు రాలిపోతోందా? ఇవి తినండి చాలు..!
జుట్టు కుదుళ్లకు పోషణ ఇచ్చే సీడ్స్, నట్స్ తీసుకోవాలి. వీటిలో విటమిన్ - ఈ సమృద్ధిగా ఉంటుంది.
గ్రీక్ పెరుగులో ప్రోటీన్‌లు పుష్కలంగా ఉంటాయి. అవి జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడతాయి.
క్యారెట్లలో బీటా- కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఇది దొహదం చేస్తుంది.
చిలకడదుంపలో సైతం బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది నిస్తేజమైన జుట్టు కుదుళ్లను పటిష్టం చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలలో అధిక స్ఠాయిలో సిలికా ఉంటుంది. జుట్టు రాలే సమస్యను ఈ స్ట్రాబెర్రీ అరికడుతుంది.
ఓట్స్‌లో ఫైబర్, జింక్, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ అమ్లాలు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండ జుట్టు పెరుగుదలను ప్రేరేపించే పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అందులో
పుష్కలంగా ఉంటాయి.