వీటిలో అత్యధిక పోషకాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వారు అంటున్నారు.
వీటిని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధకత పెరుగుతోంది.
గుండె, కిడ్నీ తదితర అవయవాలకు బలాన్నిస్తోంది.
నిత్య యవ్వనంగా ఉండడానికి ఉసిరికాయ టానిక్‌లాగా పని చేస్తోంది.
ఒక స్పూన్ ఉసిరి రసం, అర టీ స్పూన్ తేనెతో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే.. కంటి లోపాలు దరి చేరవు. అలాగే కండరాలు సైతం బలంగా తయారవుతాయి.
ఉసిరి రసంలో కలిపి కాకరకాయ రసం తీసుకుంటే షుగర్ వ్యాధిని నియంత్రించ వచ్చు. ఉసిరి, నేరేడు, కాకర కాయ పొడిలను మిశ్రమంగా చేసి.. తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి సైతం నయమవుతోంది.
ఎండిపోయిన ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతోంది.
రెండు ఉసిరికాయలను నీటిలో నానబెట్టి.. ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయండ వల్ల కళ్లు ఎర్రబడటం, దృష్టి లోపాల సమస్య దూరమవుతోంది.
ఉసిరికాయ గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని వాటిని కొబ్బరి నూనెలో మరిగించి.. చల్లారిన అనంతరం మాడుకు పట్టిస్తే జుట్టు మృదువుగా మారుతోంది.
ఉసిరికాయలో విటమిన్ సి, ఐరన్ ఉంటాయి. నారింజ పండులో కంటే ఉసిరిలో 20 రెట్లు విటమిన్ సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.