బెల్లం పానకం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

బెల్లం పానకం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

పానకాన్ని బెల్లం, యాలకులు, నీరు, మెరియాలతో తయారు చేస్తారు. 

బెల్లం సహజమైన చక్కెరతో ఉంటుంది. పానకం శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇది అలసట తగ్గించి, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

పానకంలో పొటాషియం ఉంటుంది. ఇది జీర్ణక్రియ రసాలను ఉత్పత్తి చేయడంలో దోహదపడుతోంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం తదితర సమస్యలను నివారిస్తుంది. 

బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు తదితర వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

పానకంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతోంది. రక్తహీనతను నివారిస్తోంది. 

వేడిని తగ్గించి.. శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడుతుంది. 

పానకంలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలంగా.. ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

పానకం.. నోటిలోని బ్యాక్టీరియాను చంపుతోంది. దంత క్షయం, చిగుళ్ళ వ్యాధిని నివారించడంలో దోహదపడుతోంది. 

పానకం తాగడం వల్ల మహిళలు ముఖ్యంగా నెలసరి సమయంలో నొప్పి తీవ్రత తగ్గుతోంది.