నల్ల నువ్వుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?

నువ్వుల్లో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వు, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బుల సమస్యను తగ్గిస్తుంది. 

వీటిలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.

ఈ నల్ల నువ్వుల్లో మెగ్నీషియం, విటమిన్ బీ 6 వంటి అనేక పోషకాలుంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

నల్ల నువ్వుల్లో జింక్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉండచడంలో సహాయ పడతాయి. 

ప్రతి రోజూ ఉదయం పరగడుపున నల్ల నువ్వులను బెల్లంతో కలిపి తీసుకుంటే.. ఎముకలు, వెన్నుపూస బలంగా తయారవుతాయి.

వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఉండవు. జీర్ణ క్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. 

నల్ల నువ్వుల్లో సెరోటోనిన్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనల తగ్గితుంది. నిద్ర లేమి, నొప్పులను సైతం తగ్గించేందుకు సహాయ పడుతుంది.

నల్ల నువ్వుల్లో ఎంత పోషకాలున్నాయో.. తెల్ల నువ్వుల్లో సైతం అంతే పోషకాలుంటాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.