క్యారెట్ జ్యూస్ రోజూ తాగడం వల్ల ముఖ సౌందర్యం పెరుగుతుంది. చర్మం మరింత నిగారింపుగా తయారవుతుంది.
ఏళ్ల తరబడి ఇబ్బంది పెడుతున్న వ్యాధులు నయమవుతాయి. శరీరంలోని వాపును తగ్గించడంలో క్యారెట్ ఉపయోగపడుతుంది.
డయేరియాను నివారించడంలో సహాయపడుతుంది
నిద్ర లేమితో బాధపడే వారికి క్యారెట్ జ్యూస్ చక్కటి ఔషధంలా పని చేస్తుంది. రోజు క్యారెట్ జ్యూస్ తీసుకోవటం వల్ల నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
లైంగిక సంబంధిత సమస్యలతో బాధపడేవారికి క్యారెట్ జ్యూస్ చాలా మంచిది. ఇది పురుషుల్లో వీర్య వృద్ధిని పెంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.