కొత్తమీర పచ్చడి తీసుకుంటే.. కడుపుబ్బరం, ఎసిడిటీ వంటి వాటి నుంచి త్వరగా ఉపశమనం ఉంటుంది. మల విసర్జన సైతం సాఫీగా ఉంటుంది.
కొత్తిమీరలో ఉండే విటమిన్ కే కారణంగా.. శరీరంలో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. గుండె జబ్బుల నుంచి సైతం రక్షిస్తుంది.
విటమిన్ కే.. ఎముకల ఆరోగ్యానికి దోహద పడుతుంది. ముఖ్యంగా ఆస్టియోఫోరోసిస్ నుంచి కాపాడుతుంది.
వృద్ధాప్యం దరిచేరకుండా కాపాడుతుంది. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా రక్షిస్తుంది.
శరీరంలో మంటలు, నొప్పులు ఉన్న వారు కొత్తిమీరను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది దీర్ఘకాలిక వ్యాధులను సైతం తగ్గిస్తుంది.
క్యాన్సర్ కణాల వృద్ధిని కూడా కొత్తిమీర నివారిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిని కొత్తిమీర తగ్గిస్తుంది. దీంతో డయాబెటిస్ పేషెంట్లకు ఇది చాలా ఉపయోపడుతుంది.