డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఇన్ని ఉపయోగాలా..

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీర్య నాణ్యత, కౌంట్ పెరుగుతుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్,యాంటిఆక్సిడెంట్‌లు ఉండడం వలన గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది.

ఇందులో ఉండే మినరల్స్, కాల్షియం, ఫాస్పరస్‌  ఎముకలను ధృడంగా ఆరోగ్యంగా ఉంచుతాయి.

దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని, అవయవాల పనితీరును   మెరుగుపరుస్తు్ంది.

దీనిలో విటమిన్ బి,సి, పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

డ్రాగన్ ఫ్రూట్‌లో కాలరీస్ శాతం తక్కువగా ఫైబర్ శాతం ఎక్కువగాఉంటుంది. బరువును నియంత్రించుకోవడానికి ఈ పండు చక్కగా ఉపయోగపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్‌ను ఆస్వాదించి తినాలి.  దీనిపై ఉన్న తొక్కను తీసివేసి ముక్కలుగా కట్ చేసుకోని లాగించేస్తే సరి..