బ్లూబెర్రీస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..

బ్లూబెర్రీస్ రక్తపోటును తగ్గించడంలో, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మెదడు పనితీరును పెంచడంలో బ్లూబెర్రీస్ లోని యాంటీఆక్సిడెంట్లు మెదడు వృద్దాప్యాన్ని నెమ్మదించేలా చేస్తాయి.

బ్లూబెర్రీస్ తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ కాలం కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైబర్ ఇందుకు సహకరిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది

బ్లూబెర్రీస్‌లో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

చర్మఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్లూబెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ నిగారింపును మెరుగుపరుస్తుంది.

బ్లూబెర్రీస్ ఉండే ఆంథోసైనిస్‌లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంది.