ఉదయమే వేపాకులు తింటే.. ఈ లాభాలు మీ సొంతం!

వేపాకు చేదుగా ఉంటుంది కానీ, ఆయుర్వేదంలో దీనిని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

వేపాకులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ అల్సర్‌, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి వైరల్‌ వంటి ఎన్నో గొప్ప లక్షణాలు ఉంటాయి.

పరగడుపున వేపాకులు తింటే.. పేగు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలిమెంటరీ కెనాల్‌ను వ్యాధికారకాల నుంచి ఇది రక్షిస్తుంది.

ప్రతిరోజు ఉదయం వేపాకులను తిన్నా, కషాయం చేసుకొని తాగినా.. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు.

వేపాకుల్లో ఉండే ఫైబర్.. ప్రేగుల కదలికల్ని మెరుగుపరుస్తాయి. దీంతో.. కడుపు ఉబ్బరం, మల్లబద్ధకం వంటివి దూరమవుతాయి.

వేపాకులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు.. రక్తంలోని మలినాల్ని తొలగించి, శుద్ధి చేసి, లివర్‌ పనితీరుని మెరుగుపరుస్తుంది.

వేపాకులతో కషాయం చేసుకొని తాగడం వల్ల.. మూత్రపిండాలకు సంబంధించిన జబ్బులన్ని మాయమవుతాయని అంటున్నారు.

అయితే.. వేపాకులను అతిగా తింటే దుష్ప్రభావాలు ఎదురవుతాయి. కాబట్టి.. రోజుకు 5 నుంచి 6 ఆకులు మాత్రమే తింటే మంచిది.