రేగు పండ్లు తింటే ఇన్ని  లాభాలున్నాయా..? 

ఈ పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా ఉంటాయి. 

రేగు పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలున్నాయి. ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధంగా పని చేస్తుంది. 

రేగు పండ్లలో కోలస్ట్రాల్ తగ్గించే గుణం ఉంది. దీంతో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. 

రేగు పండ్ల పేస్ట్‌ను గాయాలపై పూతగా వాడతారు. దీంతో గాయాలు త్వరగా నయమవుతాయి. 

రేగు పండ్ల తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సైతం మెరుగుపడుతుంది. 

రేగు పండ్ల మలబద్దకాన్ని నివారిస్తుంది.

ఆర్థరైటిస్‌తో బాధపడే వారు రేగు పండ్లు తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.