రాత్రంతా నానబెట్టిన ఓట్స్ తింటే పలు ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అవేంటంటే..
ఓట్స్‌లో ఫైబర్ అధికం. దీంతో, పేగుల్లో కదలికలు మెరుగై మలబద్ధకం వదిలిపోతుంది
వీటిల్లో ఉండే ఫైబర్, ఇతర కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిల్లో ఎగుడుదిగుడులను నిరోధిస్తాయి
ఇవి తిన్నాక కడుపు నిండుగా అనిపించడంతో ఆకలి తక్కువగా వేస్తుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది
వీటిల్లోని బీటా గ్లూకాన్, సాపోనిన్, ఇతర ప్రొటీన్లు జుట్టు మరింత ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
ఇందులోని విటమిన్లు, మినరల్స్, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడతాయి.
ఓట్స్‌లోని పీచు పదార్థం, ఇతర పోషకాలు చెడు కొలెస్టెరాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తాయి
ఓట్స్‌ను రాత్రంతా నానబెడతాం కాబట్టి తెల్లారి సులువుగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు
నానబెట్టిన ఓట్స్‌కు రకరకాల పదార్థాలు జత చేసి విభిన్న అల్పాహారాలు తయారు చేసుకోవచ్చు.
Related Web Stories
చర్మానికి కొబ్బరి నూనె వాడితే కలిగే ప్రయోజనాలు ఇవే
పొద్దున్నే బెల్లం, పసుపు కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా?
వీటిలో యాంటీఆక్సడెంట్లు పుష్కలం..
గుమ్మడి గింజలు ఎక్కువ తింటున్నారా? అయితే జాగ్రత్త!