బీరకాయల్లో అనేక పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మంచిదని వారు సూచిస్తున్నారు.
బీరకాయలో విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, జింక్, కాపర్, థైమీన్, పిండి పదార్థాలతోపాటు నీటి శాతం అధికంగా ఉంటుంది.
బీరకాయలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీనిని తరచూ తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య నుంచి అధిగమించవచ్చు.
బీరకాయలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తుంది. నొప్పులు, అలసట నుంచి దూరం చేస్తుంది.
శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో బీరకాయ సహాయ పడుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు, రోగాలతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. అంతే కాదు బీరకాయ తింటే తక్షణమే శక్తి లభిస్తుంది.
బీరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతోంది.
బీరకాయ కూర తింటే.. చాలా త్వరగా అరిగిపోతుంది. దీని వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవు. అదే విధంగా పేగుల కదలికను, జీర్ణ క్రియను సైతం మెరుగు పరుస్తుంది.
చిన్న పిల్లలను మలబద్ధకం సమస్య ఇబ్బంది పెడుతోంటే.. బీరకాయ కూర తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బీర కాయ తినడం వల్ల లివర్ ఆరోగ్యంగా పని చేస్తుంది. రక్తాన్ని సైతం శుద్ధి చేస్తుంది.
బీర కాయ తొక్కుతో రోటి పచ్చడి చేసుకుంటే.. చాలా బాగుంటుంది. వీటిలో సైతం పోషకాలుంటాయి.