సాధారణ ఉప్పు కంటే సైంధవ లవణం ఎంతో శ్రేష్టమైందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ సైంధవ లవణం అద్భుతంగా పని చేస్తోందంటున్నారు.
ఈ ఉప్పును వాడడం వల్ల శరీరానికి మేలు జరుగుతోంది. వీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. అందుకే సాధారణ ఉప్పునకు ఇది ప్రత్యామ్నాయమని నిపుణులు సూచిస్తున్నారు.
సైంధవ లవణం అంటే.. మెగ్నీషియం, సల్ఫేట్‌లతో తయారైన ఖనిజ లవణం. ఈ ఉప్పు ముదురు నీలం, ఊదా, గులాబీ, నారింజ, ఎరుపు, పసుపు, బూడిద రంగల్లో లభ్యమవుతోంది.
వీటిలో అయోడిన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వారు సైంధవ లవణం వాడుకోవడం అత్యంత ఉత్తమం.