0fc8c8d2-5413-43fe-a4bb-dd30dfd6f560-Cauliflower-07.jpg

   Cauliflower: క్యాలీఫ్లవర్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

7deebdcb-6d15-4775-9f65-66d4dd969a5a-Cauliflower-09.jpg

క్యాలీఫ్లవర్ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పలు ఆరోగ్య సమస్యలు ఉన్న వారు.. వాటిని ఆహారంగా తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. 

143766a3-0eee-47bc-bef7-606d83586a14-Cauliflower-00.jpg

విటమిన్ సి, కె, బి6 వంటి ముఖ్యమైన విటమిన్లు క్యాలీఫ్లవర్‌లో పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటిఆక్సిడెంట్లు శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 

28613481-5633-4462-a263-8f95eb2441a5-Cauliflower-03.jpg

క్యాలీఫ్లవర్‌లో సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఉంటుంది. ఇది వివిధ రకాల క్యాన్సర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

క్యాలీఫ్లవర్‌లో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో దోహదపడుతోంది. 

ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు.. క్యాలీఫ్లవర్‍ను తరచూ తీసుకోవాల్సి ఉంటుంది.

వీటిలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. 

వీటిని తింటే కొంత మందికి అలెర్జీ వచ్చే అవకాశముంది. అంటే.. చర్మం ఎర్రబడడం, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. 

థైరాయిడ్ సమస్య ఉన్న వారు క్యాలీఫ్లవర్‌ను తీసుకోక పోవడం ఉత్తమం.  

మూత్రపిండ సమస్యతో బాధపడేవారు క్యాలీఫ్లవర్‌ తీసుకోవాలంటే.. తొలుత వైద్యుడిని సంప్రదించడం మంచిది.