దబ్బ పండు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?

దబ్బు పండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

వీటిలో యాంటీఆక్సిడెంట్స్‌ అధికం. అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది. 

దబ్బ పండు రసాన్ని రోజూ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధులు దరిచేరవు.

దబ్బ పండు షర్బత్‌ చాలా మంచిది. వాంతులు, దప్పిక, నోటిపూత, చిగుళ్ల వాపులు తగ్గుతాయి. 

దబ్బ పండులో ఉండే విటమిన్‌ సీ, మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

చాలామంది మహిళలకు... ముఖ్యంగా పిల్లలకి కడుపులో నులిపురుగులు చేరి ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో దబ్బ రసంలో వాము, జీలకర్ర కలిపి తీసుకుంటే వాటికి చెక్‌ పెట్టొచ్చు. 

ఈ పండు రోజూ తింటే జుట్టు బాగా పెరిగుతుంది. జుట్టు రాలే సమస్య నియంత్రణలోకి వస్తుంది. త్వరగా తెల్లజుట్టు రాకుండా ఆపుతుంది.

ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. 

క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.  

గుండె వేగాన్ని నియంత్రించడంతోపాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.