గాడిద పాలు తాగితే ఇన్ని
లాభాలున్నాయా..?
ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు, ఒంటి తదితర జంతువులతో పోలిస్తే.. గాడిద పాలు వల్ల అధిక లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పాలలో ఉండే ఔషధ గుణాలు.. తల్లిపాలలో ఉండే ఔషధ గుణాలకు చాలా దగ్గర ఉంటాయంటున్నారు.
పాలలో విటమిన్ ఎ, బి1, బి 2, బి 6, సి, డితో పాటు విటమిన్ - ఈ కూడా సమృద్దిగా ఉంటుందని చెబుతున్నారు.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో చర్మపు మడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
నిద్రలేమి, ఎసిడిటీతోపాటు ఎగ్జిమా, సిఫిలిస్, స్కాబిస్, దురద, తామర... వంటి ఇన్ఫెక్షన్లకి గాడిద పాలు మంచి ఔషధమని చెబుతున్నారు నిపుణులు
గాడిద పాలను సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీలో విరివిగా వినియోగిస్తారు. ముఖ్యంగా సబ్బుల తయారీలో వాడతారు.
ఈ పాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది.
ఇన్ఫెక్షన్లు, కోరింత దగ్గు, ఆర్థరైటిస్, వైరల్ జర్వాలు, ఆస్తమా, గాయాలు నయం చేసేందుకు గాడిద పాలు వాడతారు.
అంటు వ్యాధులు, బ్యాక్టీరియా, వైరస్ సోకకుండా కాపాడుతుంది.
రక్తపోటు తగ్గించడానికే కాదు.. ఎముకలకు బలాన్ని సైతం ఇస్తుంది.
Related Web Stories
మొలకెత్తిన మెంతి గింజలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
ఈ 6 జాగ్రత్తలతో చర్మాన్ని కాపాడుకోండి
శీతకాలంలో రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే...
కొలస్ట్రాల్ సమస్య.. వీటిని తాగితే మీ రక్త నాళాలలు క్లీన్ అవుతాయి..