జోన్న రోట్టి వల్ల ఇన్ని లాభాలున్నాయా?

జొన్నలు లేదా సొర్గమ్ (Sorghum) అనేది ఒక పౌష్టిక ఆహారం.

వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్‌తోపాటు ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ ఉదయం వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. 

జొన్నలలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.  

జొన్న రొట్టెలు తినడం వలన బరువు తగ్గ వచ్చు. 

డయాబెటిస్ ఉన్న వారు వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

వీటిలో ఫైబర్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.  

జొన్నల్లో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B ఉంటాయి. ఇవి   శరీరంలో రక్తహీనతను తగ్గించేందుకు దోహదం చేస్తుంది.  

జొన్నల్లో మెగ్నీషియం, కాల్షియం తదితర ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతుంది.

జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి. 

జొన్నల్లో విటమిన్ సితోపాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.