వేపు వువ్వుతోనే కాదు.. మామిడి పువ్వుతో సైతం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని హెల్త్ న్యూట్రిషియన్లు చెబుతున్నారు.
మామిడి చెట్టు నిండా అనేక ఔషధ గుణాలు ఉన్నాయని వారు అంటున్నారు.
మామిడి పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని.. వీటిని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చునని పేర్కొంటున్నారు.
మామిడి పూలలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. దీంతో డయాబెటిస్ ముప్పు రాదు.
మామిడి పూలలో యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు, యాక్నె తదితర చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది.
ఈ పూలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.
మామిడి పూతలో పుష్కలమైన పోషకాలు ఉన్నాయి. ఇవి అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతోంది.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. మామిడి పూలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి మంట, వాపు తదితర సమస్యలను తగ్గిస్తాయి.
కీళ్లను ఆరోగ్యంగా ఉంచి ఆర్థరైటిస్ రాకుండా నివారిస్తుంది.
ఈ పూలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇన్పెక్షన్లు రాకుండా కాపాడుతోంది
ఈ పూలు తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతోంది. దీంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మామిడి పూలను దగ్గు తగ్గించడంలోనూ ఉపయోగిస్తారు. ఇది దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాస సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మామిడి పూలలో ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గాలనుకొనే వారు.. ఈ పువ్వు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
ఈ పూల వాసనతో ముక్కు దిబ్బడను నివారించుకోవచ్చు.
ఈ పూలలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటి ద్వారా ఒత్తిడి, ఆందోళన తదితర సమస్యలను నివారించ వచ్చు.