తాటిపండు (తాటికాయ) వల్ల ఇన్ని లాభాలున్నాయా ?
తాటిపండు వల్ల చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్యౌషధమని వారు అభివర్ణిస్తున్నారు.
తాటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని పోషకాలు క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తాయి.
వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతోంది.
మలబద్ధకం, పేగు సంబంధిత వ్యాధులు నయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది.
తాటి పండులో విటమిన్ బి ఉంటుంది. ఇది వివిధ వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
తాటి పండులో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. దీంతో దంతాలు, ఎముకలు బలంగా ఉంటాయి.
దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడే వాళ్లు.. తాటి పండు తినడం వల్ల చక్కని ఉపశమనం పొందవచ్చు.
తాటి పండులో విటమిన్ ఎ, బి, సి, జింక్, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం తదితర పోషకాలు ఉంటాయి.
తాటిపండు.. అలాగే తినవచ్చు లేదా గుజ్జు వేరు చేసి వివిధ వంటకాలలో అంటే.. తాటి రోట్టి, తాటి కేక్, తాటి చేపలను తయారు చేసుకోవచ్చు.
Related Web Stories
పచ్చిమిర్చితో ఇంత మేలా
సాయంత్రం పూట వ్యాయామం చేస్తే..
ఈ పండు మీరెప్పుడైనా తిన్నారా.. లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు.
చలికాలంలో చిలగడదుంపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..