తేగలతో ఇన్ని లాభాలున్నాయా..?

తేగల్లో పొటాషియం, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

ఫైబర్‌, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తాయి. ఇవి పోషక లోపాన్ని తగ్గిస్తాయి. 

ఇందులోని విటమిన్‌ సి ఉంటుంది. ఇది తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచడంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

వీటిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది.

కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది. 

కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గించడానికీ.. తేగలు సహాయపడతాయి.

షుగర్‌ పేషెంట్స్‌ వీటిని తీసుకోవడం వల్ల.. రక్తంలో చక్కర స్థాయిని నియంత్రిస్తుంది. 

తేగల్లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. రోజుకు ఒకటి తీసుకోవడం వల్ల రక్తహీనత దూరమవుతుంది. 

తేగల్లో మెగ్నీషియం సమృద్దిగా ఉంటుంది. ఇది హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌ చేస్తుంది.  

తక్కువ ఖర్చుతో దొరికే.. అధిక పోషక విలువలు తేగల్లో ఉన్నాయి.