పిస్తా వల్ల చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతోందని అంటున్నారు.
ఈ పప్పులో జింక్ అధికంగా ఉంటుంది. వీటిలో విటమిన్ బి 6 ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతోంది.
వీటిలో సెలీనియం యాంటీఆక్సిడెంట్‍గా పని చేస్తోంది. ఇది కణాలు దెబ్బతినకుండా కాపాడుతోంది.
శీతాకాలంలో శరీరానికి అవసరమైన పోషకాలను ఈ పప్పు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వీటిలో జింక్.. వైరల్ ఇన్ఫెక్షన్లనే కాదు.. వాటి తీవ్రతను సైతం తగ్గిస్తుంది. పిస్తాపప్పు సంతృప్తికర, ఆరోగ్యవంతమైన ఆహారమని వైద్యుల సైతం ధృవీకరిస్తున్నారు. వీటిలో ఏఎండీ.. కంటిశుక్లాలు, కళ్ళపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా కంటి దృష్టిని కాపాడుతుంది.
పిస్తాపప్పులో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు రోగనిరోధక కణాల కార్యకలాపాలను పెంచుతుంది. ఇందులోని ప్రీ బయోటిక్ లక్షణాలు పేగులోని బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది శ్లేష్మ పొర రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
వీటిని వీడిగా తీసుకోకుంటే.. సలాడ్లు, ఇతర డెజర్ట్ లలో సైతం వేసుకోని తీసుకోవచ్చు.