మెంతులు రుచిలో కాస్త చేదుగా ఉన్నా.. వాటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మొలకెత్తిన మెంతులు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.
మొలకెత్తిన మెంతులు పరగడుపునే తినడం వల్ల.. మధుమేహంతోపాటు ఇతర వ్యాధులకు దివ్యౌషధంలా పని చేస్తోంది.
మొలకెత్తిన మెంతులు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరగవుతోంది.
వీటిలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి.
వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని రోజూ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం తగ్గుతాయి.
ఇవి తినటం వల్ల రుతుక్రమం సక్రమంగా జరుగుతుంది.
వీటిని తీసుకోవడం వల్ల PMS లక్షణాలు తగ్గుతాయి. ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మొలకెత్తిన మెంతులు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
మెనోపాజ్ దశలోకి వచ్చిన మహిళలకు ఈ మొలకెత్తిన మెంతులు తీసుకోవాలి. వీటి వల్ల హార్మోన్ల స్థాయి సమతుల్యంగా ఉంటుంది.
ఇవి నెలసరి సమయంలో నొప్పిని సైతం నియంత్రిస్తుంది. దీంతో పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
మొలకెత్తే ప్రక్రియలో మెంతిలోని పోషక విలువలు పెరుగుతాయి. ఈ పోషకాలు కండరాలు, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.