గాడిద పాలు.. పోషకాలు మెండు

ఒకప్పుడు ఆవు పాలను మించి ఆరోగ్యరమైనవి ఏవీ ఉండేవి కాదని అనుకునేవారు.  గాడిద పాలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 

గాడిద పాలలో లాక్టోస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక సహజ శక్తి వనరు. వేసవిలో గాడిద పాలు తాగడం చాలా మంచిది. అథ్లెట్లకు, శారీరక శ్రమ చేసేవారికి చాలా మేలు చేస్తాయి.

గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, బి1, బి2, బి6, సి, డి, ఇ గాడిద పాలలో సమృద్ధిగా లభిస్తుంది.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో ఉపయోగపడతాయి. 

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటుంది. ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఎంతో ముఖ్యం.

గాడిద పాలను బ్యూటిఫికేషన్ వస్తువుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పురాతన కాలంలో రుమాటిజం, దగ్గు, గాయాలకు చికిత్సగా వాడేవారు.

ఆవులు, మేకలు, గేదెలు, ఒంటెలు వంటి ఇతర జంతువుల పాలతో పోలిస్తే గాడిద పాల వల్లే అధిక లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే 19వ శతాబ్దంలో అనాథ శిశువులకు తల్లి పాలకు బదులు గాడిద పాలు ఇచ్చేవారని తెలుస్తోంది.