చేపలతో పాటు వాటి గుడ్లలో కూడా పోషకాలుంటాయని మీకు తెలుసా. చేప గుడ్లను జన అని అంటారు.
చేప గుడ్లలోశరీరానికి అవసరమైన న్యూట్రిషన్లు, బి 12, డి, ఎ తదితర విటమిన్లు, మినరల్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.
విటమిన్ ఏ కంటి చూపు మెరుగుపరచడంలో సాయపడుతుంది. నిత్యం చేపలు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్త శుద్ధ అవుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి చేపగుడ్లు బెస్ట్ ఆప్షన్.
రెగ్యులర్‌గా చేప గుడ్లు తింటే బీపీ సమస్య తగ్గుతుంది. చేప గుడ్లలో ఉండే విటమిన్ డి తో ఎముకలు, దంతాలను దృఢంగా మారతాయి.
చేప గుడ్లు గుండె జబ్బులు రాకుండా నివారిస్తాయి. మతిమరపు సమస్య ఉన్నవారు, అల్జీమర్స్ పేషెంట్లు కూడా క్రమం తప్పకుండా చేప గుడ్లను తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.