సీతాఫలం మాత్రమే కాదు.. గింజలు, చెట్టు ఆకులూ ఉపయోగించుకోవచ్చు.
సీతాఫలం గింజల్లో విటమిన్ ఏ, కె, సి, ఈ, బి-1 వంటివి పుష్కలంగా ఉంటాయి.
అలాగే జింక్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి.
గింజలను ఎండబెట్టి మిక్సీ పట్టిన పొడిని కూరల్లో వేసుకుంటే చాలా మంచిది.
ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
వివిధ గుండె జబ్బులు తగ్గించి, గుండె కండరాలను బలోపేతం చేస్తాయి.
సీతాఫలం గింజల్లోని డైటరీ ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
శరీరంలో కొలాజిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదించేలా చేస్తాయి.
సీతాఫలం గింజలు బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
శరీరంలో క్యాలరీలు తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీర వాపును తగ్గిస్తాయి.
మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఖనిజాలు ఎముకల ఆరోగ్యం మెరుగుపరుస్తాయి.
సీతాఫలం గింజల్లో ప్రోటీన్లు ఉండడం వల్ల జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
Related Web Stories
కాలుష్యం కారణంగా వచ్చే 6 వ్యాధులు ఇవే..
జుట్టు ఎక్కువగా రాలుతోందా.. ఈ జాగ్రత్తలుతీసుకుంటే వెంటనే కంట్రోల్ అవుతుంది..
గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారా.. అయితే అనారోగ్య సమస్యలు తప్పవు..
ఐస్ క్రీమ్ తినడం వల్ల ఇన్ని లాభాలా..