గుట్కా, పొగాకు తింటే.. ఈ రోగాలు గ్యారంటీ

గుట్కా, పొగాకు సంబంధించిన పదార్థాలు తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. 

దంతాలను దెబ్బతీస్తాయి.. శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

గుట్కా, పొగాకు తయారీ పదార్థాల్లో రకరకాల రసాయనాలు, రంగులు వినియోగిస్తారు. ఇవి హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. 

డిఎన్ఏను సైతం దెబ్బ తీసే అవకాశముంది.

గుట్కా వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల.. శరీరంలోని వివిధ భాగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

భారతీయులు అధికంగా గుట్కాను వినియోగిస్తున్నారు. దీంతో నోటి క్యాన్సర్ తో పాటు వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు.  

శరీరంలోని ఎంజైమ్ లపై చెడు ప్రభావం చూపుతుంది. 

శరీరంలోని ఎంజైమ్ లు హార్మోన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. గుట్కా తీసుకోవడం వల్ల సెక్స్ హార్మోన్ల తయారీలో ఇబ్బందులు తలెత్తుతాయి.

శరీరరంలో హార్మోన్ల ప్రక్రియను అడ్డుకుంటుంది. 

గుట్కా తినడం వల్ల ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సెక్స్ హార్మోన్లు తీవ్ర ప్రభావం చూపుతుంది. 

గర్భిణీ స్త్రీలు గుట్కాను తీసుకుంటే అది వారి పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.