ఈ చిట్కాలు పాటిస్తే చాలు.. పొట్ట తగ్గి పోతుంది.

అన్నానికి బదులు కొర్రలు, ఓట్స్, జొన్నలు, రాగులు, కందులు, ఉలవలు ఆహారంగా తీసుకోవాలి.

నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు.. బీర, దోస, సొరకాయలను తీసుకోవాలి.

పొట్టతగ్గేందుకు ప్రయత్నించే వారు.. పగటి పూట నిద్రకు స్వస్తి పలకాలి.

ఆహారం మితంగా తీసుకోవాలి.. అది కూడ ఒక రోజులో ఎక్కువ సార్లు తినాలి.

బార్లీ గింజల నీరు తాగడం వల్ల పొట్ట తగ్గుతుంది.

పరగడుపున గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల పొట్ట తగ్గే అకాశముంది.