ఎముకలెందుకు గుల్లబారతాయి..
30 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి ఎముకలు పూర్తి సాంద్రతను సంతరించుకుంటాయి.
ఆ తర్వాత ఎముక పునర్నిర్మాణం మొదలవుతుంది.
ఈ మార్పులన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత క్యాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి.
ఆహారం ద్వారా శరీరంలోకి చేరుకునే క్యాల్షియంను ఎముకలు పీల్చుకుంటాయి.
ఒకవేళ రక్తంలో క్యాల్షియమ్ స్థాయి తక్కువగా ఉంటే ఎముకల మజ్జ నుంచి క్యాల్షియం రక్తంలోకి విడుదలవుతుంది.
ఎముకలకే క్యాల్షియమ్ సరిపోకపోతే రక్తం నుంచి శోషించుకుంటాయి.
ఇలా ఎముకలు, రక్తం...
రెండిట్లో క్యాల్షియం
స్థాయులు సక్రమంగా ఉన్నంతకాలం ఎటువంటి సమస్యా ఉండదు.
ఎప్పుడైతే ఈ సమతౌల్యం అదుపు తప్పుతుందో అప్పుడే ఎముకలు గుల్లబారటం, బలహీనపడటం మొదలవుతుంది.
అలాగే సహజసిద్ధంగానే 30 ఏళ్ల వరకూ పెరుగుతూ వచ్చిన ఎముకల సాంద్రత అప్పటి నుంచి తగ్గటం మొదలుపెడుతుంది.
దాంతో ఆస్టియోపొరోసిస్, ఎముకలు తేలికగా విరిగిపోవటం మొదలైన సమస్యలు మొదలవుతాయి.
Related Web Stories
లంచ్ తినే సమయంలో ఈ పనులు చేస్తున్నారా? ఇలా చేస్తే బరువు పెరగడం ఖాయం..
రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..
అవకాడో, గుడ్డు రెండిటిలో ఏ టోస్ట్ అల్పాహారంగా బెస్ట్ ..!
మెులకెత్తిన బంగాళా దుంపలు ఎంత ప్రమాదమో తెలుసా..