వివిధ కారణాల రీత్యా అన్నానికి బదులు ప్రత్యామ్నాయాలు తినాల్సి రావచ్చు. అయితే, అన్నానికి సాటిరాగల ఆప్షన్స్ బోలెడన్ని ఉన్నాయి.
క్వినోనా రైస్‌లో గ్లుటెన్ ఉండదు. అన్నానికంటే ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి.
తక్కువ కేలొరీలు, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం కావాలనుకుంటే రైస్డ్ బ్రోకలీ ట్రై చేయండి.
బియ్యం కంటే బార్లీ చాలా బెటర్. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి
సాధారణ పాస్తాలు, అన్నం కంటే మెరుగైనది కాస్కోస్ పాస్తా. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ
ఫెరో వీట్ కూడా అన్నానికి మంచి ప్రత్యామ్నాయం. అయితే, దీని ఫ్లేవర్ కాస్త డిఫెంట్
ఫ్రీకె గ్రెయిన్స్ కూడా అన్నానికి మంచి ప్రత్యామ్నాయం. వీటిలోనూ ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉంటాయి
త్వరగా బరువు తగ్గాలనుకునే వారు అన్నానికి బదులు బల్గర్ వీట్ ట్రై చేయొచ్చు.
కెలొరీలు, చెక్కరలు తక్కువగా ఉండే రైస్డ్ కాలీఫ్లవర్ కూడా అన్నానికి బదులుగా తినొచ్చు
వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తుంటే షిరాటకీ రైస్ ట్రై చేయండి. సాధారణ బియ్యానికి కంటే ఇది మంచి ఆప్షన్