కిడ్నీ సమస్యలను  దూరం చేసే హెల్దీ డ్రింక్స్

మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించే కిడ్నీలు కొన్ని కారణాల వల్ల పాడవుతాయి. అలా అవ్వకూడదు అంటే.. ఈ డ్రింక్స్ తాగితే చాలు.

ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్‌: పండ్లు, కూరగాయలు, మూలికలో ఇది చేస్తారు. ఇది తరచూ తాగితే.. డీహైడ్రేషన్ సమస్య దూరమై, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడవు.

క్రాన్‌బెర్రీ జ్యూస్: ఇందులో విటమిన్స్‌, ఉర్సోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇది తాగితే.. వ్యాధికారిక బ్యాక్టీరియాను నిరోధించి, కిడ్నీ డ్యామేజీని తగ్గిస్తుంది.

బ్లాక్ కాఫీ: ఇందులోని కెఫిన్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్స్.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే, దీన్ని మితంగా తీసుకుంటే మంచిది.

ఫ్రూట్ జ్యూస్: ఇందులో శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, కిడ్నీని ఆరోగ్యంగా చేస్తుంది.

గ్రీన్ టీ: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్.. కిడ్నీ వాపు సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. కిడ్నీల్లో రాళ్లున్న వాళ్లు దీనిని రెగ్యులర్‌గా తాగితే మంచిది.

యాపిల్ వెనిగర్‌: ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సిడ్రిక్ యాసిడ్.. కిడ్నీలో రాళ్లను కరిగించడంతో పాటు టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.

దానిమ్మ రసం: ఇందులోని పొటాషియం.. కిడ్నీలో రాళ్ల సమస్యను తొలగిస్తుంది. ఇందులోని గుణాలు.. రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటాయి.