ఈ ఫుడ్స్ తింటే.. కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది

సరైన డైట్ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో ఆరోగ్య సమస్యలొస్తాయి. దీన్ని కరిగించాలంటే, ఈ ఫ్రూట్స్ తీసుకుంటే చాలు.

పైనాపిల్‌: ఇందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించేసి.. గుండె ఆరోగ్యాన్ని, జీర్ణక్రియ మెరుగు పరుస్తుంది.

కివీ: ఇందులోని పోషకాలు, ఫైబర్.. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థలోని కొలెస్ట్రాల్‌ని బందించి.. ప్రేగుల్లో ఉండకుండా చేస్తుంది.

బొప్పొయి: ఇందులోని పపైన్ అనే.. జీర్ణక్రియని మెరుగ్గా చేసి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనిలోనూ కరగని ఫైబర్ ఉంటుంది.

సిట్రస్ ఫ్రూట్స్: నిమ్మ, నారింజ, మొసంబి ఫ్రూట్స్‌లో విటమిన్ సి ఉంటుంది. వీటి జ్యూస్ తాగితే.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి.

యాపిల్స్: ఇందులో ఉండే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు.. శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడతాయి.

ద్రాక్ష: బరువు తగ్గడంలో మెరుగ్గా పనిచేసే ద్రాక్షలు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రించగలవని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.

స్ట్రాబెర్రీలు: వీటిల్లోని ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిండంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.