ఐరన్ లోపం ఉందా..  అయితే ఈ ఫుడ్స్ తినండి

రెగ్యులర్‌గా చెమటలు పట్టడం, అలసిపోవడం, కళ్ళు తిరగడం.. వంటి సమస్యలన్నీ ఐరన్ లోపం వల్ల వస్తుంటాయి.

బీట్‌రూట్‌లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని రెగ్యులర్‌గా తింటే.. ఐరన్, హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

దానిమ్మ పండ్లలో ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది తరచు తింటే.. శరీరానికి కావాల్సినంత ఐరన్ లభిస్తుంది.

బచ్చలికూరలో విటమిన్స్, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతాయి.

రెడ్‌మీట్‌లో ప్రోటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఐరన్ లోపాన్ని తగ్గించి, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి.

పప్పుధాన్యాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని వారంలో రెండు రోజులైనా తీసుకుంటే.. హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది.

గుడ్డులో ప్రోటీన్, మినరల్స్, ఐరన్, ఇతర పోషకాలుంటాయి. ఐరన్‌ లోపంతో బాధపడేవారు రోజుకో గుడ్డు తింటే మంచిది.

గుమ్మడి గింజల్లో ఐరన్ శాతం చాలా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారు రెగ్యులర్‌గా తింటే.. ఆ సమస్య దూరమవుతుంది.

ఉల్లిపాయలు.. ఇందులోని పోషకాలు ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతాయి.