రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే 6 ఫుడ్స్

కొలెస్ట్రాల్ కంట్రోల్ లేకుండా పెరిగితే.. రక్తపోటు పెరిగి బీపీ, గుండె సమస్యలొస్తాయి. వీటికి చెక్ పెట్టాలంటే.. డైట్‌లో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే సరిపోతుంది.

బాదం: ఇందులో ప్రోటీన్‌, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. ఇది గుండెకు మంచిది.

పొద్దుతిరుగుడు గింజలు: ఈ గింజల్లో స్టెరాల్స్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

నువ్వులు: ఈ నువ్వుల్లో ఫైబర్, ప్లాంట్ బేస్డ్ స్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

గుమ్మడికాయ గింజలు: చాలామంది గుమ్మడికాయని తింటారు కానీ, గింజల్ని వదిలేస్తారు. అయితే.. ఈ గింజలు చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తాయి.

చియా: వీటిలో ఫైబర్, ఆల్ఫాలినోలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేసి, గుండోను ఆరోగ్యంగా ఉంచుతాయి.

అవిసెలు: వీటిల్లో ఆల్ఫాలినోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడతాయి.