క్యాన్సర్‌ను నిరోధించే.. అద్భుత ఆహారాలు
క్యాన్సర్ ఎంతో ప్రమాదకరమైన వ్యాధి. అయితే.. మన డైట్‌లో కొన్ని ఆహారాల్ని చేర్చుకుంటే, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు నుంచి బయటపడొచ్చు.
ఆకుకూరలు: పాలకూర, కాలే, స్విస్‌చార్డ్ వంటి వాటిల్లో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, వివిధ క్యాన్సర్ల ముప్పుని తగ్గిస్తాయి.
బెర్రీస్: బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్‌బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో మంట తగ్గించి, క్యాన్సర్ కణాల పెరుగదలను నిరోధిస్తాయి.
టొమాటో: ఇందులోని లైకోపీన్.. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి.. ప్రొస్టేట్, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీ: గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి.. బ్రెస్ట్, ప్రోస్టేట్ వంటి క్యాన్సర్‌ల ప్రమాదాలను తగ్గిస్తాయి.
తృణధాన్యాలు: బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్‌లలో ఫైబర్, విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలొరెక్టల్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లను తగ్గిస్తాయి.
వెల్లుల్లి: వీటిల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి కడుపు, కొలొరెక్టల్ ప్రోస్టేట్ క్యాన్సర్‌లతో సహా అనేక క్యాన్సర్‌ల ప్రమాదాలను తగ్గిస్తాయి.
పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు .. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
సిట్రస్ పండ్లు: నారింజ, ద్రాక్షపండ్లు వంటి వాటిల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
Related Web Stories
30 ఏళ్లు దాటిన వారికి.. బెండకాయ నీటితో కలిగే 7 ప్రయోజనాలు ఇవే..
విటమిన్ డి లోపంతో పోరాడటానికి 5 ఆరోగ్యకరమైన వేసవి పానీయాలు.
రక్తాన్ని శుద్ది చేసే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
ఉదయమే వేపాకులు తింటే.. ఈ లాభాలు మీ సొంతం!