క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే.. ఈ సూత్రాలు పాటించాల్సిందే!
ధూమపానం కారణంగా 16 రకాల క్యాన్సర్లు సోకే ప్రమాదముంది. పొగతాగే వారికే కాదు.. దాన్ని పీల్చేవారికీ ప్రమాదమే. కాబట్టి.. ధూమపానానికి దూరంగా ఉండాలి.
మద్యం సేవించడం వల్ల కాలేయంతో పాటు డీఎన్‌ఏ కణాలు నాశనమవుతాయి. ఫలితంగా నోటి, కాలేయ, రొమ్ము క్యాన్సర్లు రావొచ్చు. అందుకే.. మద్యం సేవించకూడదు.
ప్రాసెస్డ్ ఫుడ్, ముఖ్యంగా ప్రాసెస్డ్ మాంసం తీసుకోవద్దు. మాంసం నిల్వ ఉంచేందుకు కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. ఇవి క్యాన్సర్ కారకాలుగా పని చేస్తాయి.
బరువు పెరిగినా క్యాన్సర్ సోకొచ్చు. కొవ్వు చేరి, రక్తంలోని ఇన్సులిన్ స్థాయిల్లో మార్పు వచ్చి.. అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి.. బరువు పెరగొద్దు.
ఫైబర్, కాల్షియం లభించే కూరగాయలు, పండ్లు, ఆహారం తీసుకోవాలి. లేదంటే పోషకాలు అందక ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇది క్యాన్సర్ కణాల వృద్ధికి కారణమవ్వొచ్చు.
క్యాన్సర్‌ని కట్టడి చేయడంలో వ్యాయామం, యోగా వంటి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి.. ఉదయం, సాయంత్రం కొద్దిసేపు వ్యాయామం చేస్తే ఎంతో బెటర్.
ఎప్‌స్టీన్-బార్ వైరస్, హెపటైటిస్ బీ వైరస్, హెపటైటిస్ సీ వైరస్, హెచ్‌ఐవీ, తదితర వైరస్‌ల బారినపడితే క్యాన్సర్ సోకొచ్చు. కాబట్టి.. ఇవి రాకుండా జాగ్రత్తగా ఉండాలి.
యూవీ రేడియేషన్ వల్ల చర్మకణాల్లోని డీఎన్‌ఏ నాశనమై.. అది చర్మ క్యాన్సర్‌కు దారితీయొచ్చు. కాబట్టి.. యూవీ రేడియేషన్ తగిలే ప్రాంతాలకు దూరంగా ఉండాలి.