బరువు తగ్గాలంటే..  ఈ చిట్కాలు పాటిస్తే చాలు

భోజనం చేసే ముందు ఓ గ్లాసు నీళ్లు తాగాలి. ఇది ఆకలిని తగ్గించడమే కాక కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

ప్రొటీన్ ఫుడ్ అధికంగా తింటే.. కడుపుని నిండుగా ఉంచుతుంది. తద్వారా మిమ్మల్ని అతిగా తినకుండా కంట్రోల్ చేస్తుంది.

సరిగ్గా నిద్రపోకపోతే.. హార్మోన్లలో హెచ్చతగ్గులేర్పడి, అతిగా తినేందుకు దారితీస్తుంది. కాబట్టి.. సంపూర్ణంగా నిద్రపోవాలి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు తినొద్దు. వీటిలో పోషకాలు ఉండవు. అధిక చక్కెరలుంటాయి. దాంతో.. బరువు పెరుగుతాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తే.. బాడీలో కొలెస్టిరాల్ తగ్గి, శరీరానికి కావాల్సినంత కేలరీలు అందుతాయి.

ఆకలి బాగా ఉన్నప్పుడు.. భోజనం కాకుండా పోషకాలున్న స్నాక్స్ తినాలి. పండ్లు, కూరగాయలు, గింజలు తింటే బెటర్.

ఆరోగ్యకరమైన ఆహారాలు, జూస్‌లు, తదితర విషయాల గురించి సలహాల కోసం.. మొబైల్ యాప్స్ వినియోగించాలి.

ఒత్తిడికి.. అది హార్మోన్స్, ఆకలిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి.. ఒత్తిడిని నుంచి విముక్తి కలిగించే పనులు చేయాలి.