వేగంగా బరువు తగ్గాలంటే.. ఈ రూల్స్ పాటించాలి
పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పీచు పదార్థాలు బరువు తగ్గడానికి తోల్పడుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి.
కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలను) తీసుకోవడం బాగా తగ్గించాలి. వాటికి బదులు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మంచిది.
భోజనానికి అరగంట ముందు పావు లీటర్ నీళ్లు తాగితే.. తక్కువ కేలరీలు తినడానికి, 44% ఎక్కువ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీలో ‘కాటెచిన్స్’ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వుని కరిగింది.. బరువు తగ్గించడంలో ఎంతో తోడ్పడుతుంది.
ప్రతిరోజూ వ్యాయామం చేస్తే.. కేలరీలు కరుగుతాయి. అలాగే.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఈ వ్యామాయం మెరుగుపరుస్తుంది.
సరిగ్గా నిద్రపోకపోయినా బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి.. బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన నిద్ర అవసరమని వైద్యులు చెప్తున్నారు.
బరువు తగ్గడానికి ప్రోటీన్ ఓ ముఖ్యమైన పోషకం. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తింటే.. రోజుకు 80-100 కేలరీలు తగ్గుతాయని తేలింది.
సోడా, కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి.. వాటికి దూరంగా ఉంటే బెటర్.
Related Web Stories
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!
ఈ మసాలాలు యమ డేంజర్ గురూ..!
కాలీ ఫ్లవర్ హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలుసా?
మీకు నిద్రలో నరాలు లాగేస్తుంటాయా? అయితే ఈ సమస్యలున్నట్టే లెక్క ..!