జీర్ణ ఇబ్బందుల నుంచి ఉపశమనానికి ఈ విత్తనాలు ట్రై చేయండి..!

సహజంగా జీర్ణ సమస్యలు, మలబద్దకం నుంచి ఉపశమనానికి ఈ విత్తనాలతో చెక్ పెట్టవచ్చు. 

చియా గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నీటిని గ్రహించి, జీర్ణ క్రియను సజావుగా చేయగల ఈ సీడ్స్ జెల్ లాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి.

అవిసె గింజలలో కరిగి, కరగని ఫైబర్ అధికంగా కలిగి  ఉంటుంది.

సైలియం విత్తనాలు కరిగే ఫైబర్ కు మూలం. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. 

నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం ఉంటాయి.

ఇవన్నీ ప్రేగు కదలికలకు, మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

వీటిని క్రమం తప్పకుండా  తీసుకోవడం వల్ల జీర్ణ అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.

మలబద్దకాన్ని తగ్గించేందుకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే నీరు పుష్కలంగా తాగాలి.